APIIC నిర్వాసితుల సమస్యలు మరియు స్థానికులకు ఉద్యాగాలు కల్పించాలి : విశాఖ 86 వ వార్డు జనసేన నాయకులు
విశాఖ 86 వ వార్డు జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్దులు APIIC నిర్వాసితుల సమస్యలు మరియు రైల్వే వ్యాగాన్ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించాలి అని 86 వ వార్డు అభ్యర్థి కదా శ్రీను అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో 88 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారే ముఖ్యమంత్రులు మారారు. కానీ, గాజువాక నియోజకవర్గంలో APIIC భూములు ఇచ్చిన రైతులు స్థితిగతులు మాత్రం మారలేదని, TDP ప్రభుత్వంలో కూడా ఆనాడు గాజువాక MLA పళ్ళ శ్రీను గారు చివరి 5 నెలలో తూతూమంత్రంగా రైతులను ఓటరుగా మార్చే విధంగా ప్రయత్నం చేశారు గానీ చిత్తశుద్ధితో చేయలేదని అన్నారు. అప్పటి TDP ప్రభుత్వంలాగే ఇప్పుడు YSR ప్రభుత్వం కూడా రైతులను ఒక వోటర్ గానే చూశారు గాని తప్ప వారి సమస్యలను తీర్చడంలో చిత్తశుద్ధితో పాటించడంలేదని పేర్కొంటూ, ప్రస్తుత గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారిని ఈ యొక్క సమస్యలు పరిష్కారం దిశగా తీసుకుని వెళ్లాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 75 శాతం లోకల్ గా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మీరు చేస్తున్న చట్టాలు ఎలా ఉన్నాయి. ఉన్నప్పుడు ఒక విధంగా పని చేస్తున్నాయి దయచేసి పరిశ్రమలపై ఒత్తిడి తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యాచరణ చేయాలని ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేయాలని జనసేన బిజెపి నాయకులు అన్నారు. ఇరు పార్టీల ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని చెప్పడంతోపాటు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గాజువాక నియోజకవర్గ MLA గా గెలిపించుకోవడం లో ప్రజలు ఓడిపోయారని, ఆనాడు పవన్ కళ్యాణ్ గారు గాజువాక నియోజకవర్గంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని ఇటువంటి నియోజవర్గంలో నేను MLA గా ప్రాతినిధ్యం వహిస్తే సమస్యలు పరిష్కార దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చొరవ తీసుకుని లాగా ప్రయత్నం చేయవచ్చును అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు ఇకపై పని చేసే వారిని గుర్తించి చట్టసభల్లోకి తీసుకుని వెళ్లేలాగా ఆలోచించాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్ అభ్యర్థులు లక్కరాజు సోంబాబు, దాడి నూకరాజు (బిజెపి), జనసేన నాయకులు భాస్కర్ రాజు అల్లు రామారావు, ఏవీ రామారావు, సిరసపల్లి కనకరాజు, లాయర్ కళావతి, చిన్న, శివ గణేష్, వెంకట్రావు, శ్రీనివాస రావు గారి కనకరాజు కర్రీ రాజు తదితరులు పాల్గొన్నారు.