చిత్తూరు ( జనస్వరం ) : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దొంద వైఖరి వీరనాడాలని జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డి గారికి సరికాదన్నారు. నాడు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఎకరాకి కనీసం 30 వేల రూపాయలు ఇవ్వాలన్న ఆయన నేటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అంతకుమించి ఇవ్వాల్సింది పోయి కనీసం మొత్తం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబు అని ఏపీ శివయ్య ప్రశ్నించారు. పంటలకే తక్కువ మొత్తంలో సమయం మించిపోయిన తర్వాత ఆదుకుంటున్నాట్టు పేరుతో చిల్లర నిధులు విడుదల విడుదల చేసి రైతులను ఆదుకుంటున్నాట్లు సీఎం గారు ప్రకటనలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. సాధారణ పంటలకే ఇలా చేస్తే వాణిజ పంటలను సాగు చేస్తున్న రైతులకు ఈ మొత్తం ఎక్కడికి సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. సాధారణ పంటలకు నాడు ముప్పై వేల రూపాయలు అడిగిన ఇప్పటి ముఖ్యమంత్రి లెక్క ప్రకారం ఎకరాకు 60 వేల రూపాయలు వాణిజ్య పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున సహాయం అందించి రైతులను ఆదుకోవాలని లేకుంటే ప్రభుత్వం మెడలు వంచి రైతులకు పరిహారం ఇప్పించేంతవరకు జనసేన పార్టీ పోరాడుతుందని ఏపీ శివయ్య హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com