Search
Close this search box.
Search
Close this search box.

సీనియర్ కవయిత్రి చిట్టే లలితకు ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు

    ఏలూరు/ కడప ( జనస్వరం ) :  శ్రీశ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు, సీనియర్ కవయిత్రి చిట్టే లలితకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట అవార్డు దక్కింది. అకాడమీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో, ఏలూరులో జరిగిన సాహిత్య, సంక్రాంతి సంబరాల్లో ఘనంగా అవార్డు ప్రదానోత్సవం చేశారు. శ్రీశ్రీ సాహిత్య, కళాపీఠం జాతీయ అధ్యక్షురాలు, ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, సమీక్షకురాలు, కాలమిస్ట్, విశ్లేషకురాలు చిట్టే లలిత సాహితీరంగంలో తనవంతు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచే సాహిత్యం పట్ల అనురక్తితో విశేషమైన కృషి సాగిస్తున్నారు. సాహిత్యం పట్ల, సంస్థ పట్ల ఆమెకున్న అంకిత భావానికి, అపారమైన నిబద్ధతకు నిదర్శనంగా లలితకు అనేక అవార్డులు, పెద్ద పదవులు తనను వెతుక్కుంటూ వచ్చాయి. శ్రీశ్రీ సాహిత్య కళాపీఠం జాతీయ అధ్యక్షురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. “మది నదిలో…” కవితా సంపుటి కవయిత్రిగా, వంద కవితలను విశ్లేషించిన సమీక్షకురాలుగా ప్రఖ్యాతి పొందారు. తన 22 సంవత్సరాల గల్ఫ్ ప్రస్థానాన్ని, అక్కడి అనుభవాలను వందకు పైగా కథలుగా మలిచి కౌముది.నెట్ కు అందించి పాఠకులను అలరించిన రచయిత్రిగా ప్రసిద్ధికెక్కారు. 2000 సం. నుండీ “ఆంధ్రభూమి”లోని కోయిలా కూయిలాతో సాహితీలోకానికి పరిచయమయ్యారు. ఉద్యోగ నిమిత్తం పరదేశంలో వున్నా తెలుగుభాష పట్ల మమకారంతో, కవయిత్రిగా, గాయనిగా, టి.వి ఆర్టిస్ట్ గా పలు అంశాలలో ప్రతిభాశాలినిగా పేరొందారు. పలు సంస్థల నుంచీ ఎన్నో సన్మానాలు, సత్కారాలు స్వీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో పలు జిల్లా కమిటీలు వేశారు. భద్రాచలంలో జాతీయ శతాధిక కవిసమ్మేళనం అద్భుతంగా నిర్వహించారు. సాహితీరత్న బిరుదును కూడా అందుకున్నారు. ప్రపంచ తెలుగు సాహితీ సాంస్కృతిక అకాడమీ చైర్మన్, శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్, ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో, శ్రీశ్రీ కళావేదిక సౌజన్యంతో శ్రీశ్రీ సాహిత్య కళాపీఠం జాతీయ అధ్యక్షురాలిగా చిట్టే లలిత తనవంతు సేవలందిస్తున్నారు. తనకు ఏపీ సాహిత్య అకాడమీ విశిష్ట అవార్డు ప్రదానం చేసిన అకాడమీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మికి, పుర్వ సభ్యులు, శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ ప్రతాప్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మక అవార్డును లలిత అందుకోవడం పట్ల పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీభూషణం, జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి, జాతీయ కార్యదర్శులు శ్రీనుబాబు, నూక సంపత్, డేబా విజయకుమార్, పార్థసారథి, గుండాల రాకేష్, తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way