న్యూస్ ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ పీఆర్‌సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ కోత, సీసీఏ ఎత్తివేత, క్వాంటం పెన్షన్ లో మార్పులు చేస్తూ జారీ అయిన జీవోలను అంగీకరించబోమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. సంక్రాంతి పండుకకు ముందు ఉద్యోగులకు తీపి కబురు అంటూ జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. తీరా జీవోలు విడుదల చేయడంతో ఉద్యోగులు ఎంత నష్టపోతున్నారనే విషయం తెలుసుకుని ఉద్యమ కార్యాచరణకు సన్నద్దం అవుతున్నారు. అయితే ఉద్యోగులు తమ సమస్యలపై ఆందోళన చేసిన క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వారికి మద్దతు ఇవ్వలేదు. మరోవైపు ఉద్యోగ సంఘాల్లోని కొందరు నేతలే వైసీపీ అధికారంలోకి రావడానికి రెండు చేతులతో ఓట్లు వేశామని చెప్పుకున్న నేపథ్యంలో.. వీరికి టీడీపీ మద్దతుగా నిలవడం లేదు. అయితే ఏపీ లో ఎక్కడ ఏం జరిగినా… ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా సరే ప్రజలకు అండగా నిలబడుతున్నది, వారి తరుపున పోరాటం చేస్తున్నది జనసేన పార్టీ మాత్రమే. దీంతో ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లోని కొందరు నేతలు తమ డిమాండ్లు, ప్రభుత్వ వైఖరిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా జనసేన పని చేస్తున్నందున తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళితే… జగన్ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.