ఏలూరు, (జనస్వరం) : నరసాపురం సభలో సిఎం జగన్ మోహన్ రెడ్డి జనసేన పార్టీ నీ రౌడీ పార్టీ అనడం చాలా నీచమైన హేయమైన చర్య. దీనిని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నరసాపురంలో మత్స్యకారులు దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ మీద జన సైనికుల మీద ఘోరమైన పదాలను ప్రయోగించారు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏ పార్టీ వారు రౌడీయిజం గూండాయిజం చేస్తున్నారో అని మర్డర్లు చేసినటువంటి వారు ఆర్థిక నేరస్థులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. దాదాపు 15,16 నెలలు జైలు శిక్ష ఎవరు అనుభవించారు. ఏ ఆర్థిక నేర చరిత్ర నుండి వచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ముఖ్యమంత్రి ఎలా అయ్యారు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. నువ్వు బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావని గుర్తు చేశారు. జనసేన రౌడీ సేన అని పదాన్ని ఉపయోగించి ఏదైతే పవన్ కళ్యాణ్ ని చూడగానే నీకు వెన్నులో వణుకు పుట్టి కిందనుంచి కారి ఎక్కడ జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ వల్ల తన పదవికి ముప్పొస్తుందని భావించి భయభ్రాంతులతో జనసేన పార్టీని రౌడీ సేన అనే పదాలతో మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడైతే ప్రజల పక్షాన నిజాయితీగా మాట్లాడి సమస్యలను ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపి సమస్య పరిష్కారానికి స్పందిస్తూ ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఎక్కడైనా మీటింగ్ పెడితే ఆయన మీద దత్త పుత్రుడు లేదా 3 పెళ్ళిళ్ళు గురించి మాట్లాడి ఒక దుస్సంస్కారమైన సంస్కృతి ఆ జగన్మోహన్ రెడ్డిదే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అనుచరులైన ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆయన యొక్క అభ్యాసాన్ని నేర్పాడని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు నిజాయితీగా సేవా సర్వీసులు అందిస్తున్నటువంటి నాయకులు కరోనా టైంలో డబ్బులు లూటి చేసినటువంటిది మీ ప్రభుత్వం అని కరోనా టైంలో జనాలను ఆదుకొని సర్వీస్ అందించి రోడ్లపై ఉన్నటువంటి వారు జనసైనికులు వారికి తినుబండారాలు గాని నిత్యవసర వస్తువులు గాని ఇచ్చినటువంటి వారు జన సేన నాయకులు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకున్న చరిత్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ది. అదేవిధంగా ఉద్దానంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చే కనువిప్పు కలిగించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ ది. ఇలా ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పనిని చూసి నువ్వు ఎంత బాధ పడుతున్నావో నువ్వు ఎంత ఆందోళన చెందుతున్నావు. నిన్న మాట్లాడిన మాటలు వింటుంటే అర్థమవుతుంది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చేసే దుష్ప్రచారం మీయొక్క పదజాలాలని మార్చుకోవాలి. మీరు రౌడీయిజం నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఆర్థిక నేరం చేసి జైలు జీవితం గడిపి వచ్చినవారు. మీరు అర్థం లేనటువంటి పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ మీద రౌడీ సేన అనే పదం ప్రయోగించడం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోండి. ఈ రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి గంగా నదిలో కలపడానికి అని హెచ్చరించారు. ఇకనుంచి అయినా మీ పదాలను మార్చుకోవాలని తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు తదితరులు పాల్గొన్నారు.