వేమూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా వేమూరు మండలం, కుచెళ్ళపాడు గ్రామంలో గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు. అనురాధ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏది అయినా ప్రమాదంలో మరణించినట్లైతే 5లక్షలు పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. అధిక సంఖ్యలో జనసేన సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. మండలంలో ప్రతి గ్రామంలో నమోదు కార్యక్రమం ఇలాగే జరగాలి అని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో 63 కొత్తగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమరౌతు బ్రహ్మం, కుచెళ్ళపాడు యువత, వేమూరు మండల జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com