జనసేన పార్టీ అధికారంలో లేకపోయిన తన గళాన్ని ఎపుడూ ప్రజల పక్షాన వినిపిస్తూనే ఉంది. గత కాలంలో కూడా అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం అయ్యేలా పోరాడటం చూశాం. తాజాగా ఇపుడు ఈ లాక్ డౌన్ పరిస్థితులలో ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ‘లా నేస్తం’ పథకాన్ని కొనసాగించడం లేదని న్యాయవాదులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘లా నేస్తం’ పథకం కొనసాగి ఉంటే వారికి ఈ కష్ట కాలంలో భరోసా లభించేది. ఈ కరోనా విపత్కర సమయంలో క్లయింట్ల నుంచి ఫీజులు వచ్చే మార్గం లేకపోవడంతో న్యాయవాదులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి జూనియర్, సీనియర్ అనే బేధం లేకుండా అందరికీ ఆరునెలల పాటు నెలకు రూ.10వేల రూపాయలు ఆర్థిక భృతి ఇవ్వాలని మరియు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని కోరారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధికి సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానం వరకూ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్థిక భృతిని న్యాయవాదులకు చెల్లించేందుకు ముందుకొచ్చింది. జూనియర్ న్యాయవాదులకు ‘వైయస్సార్ లా నేస్తం’ పథకం కింద నెలకు రూ.5 వేల రూపాయలు భృతి చెల్లిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెలకు 1,982 మందికి రూ.99.10 లక్షలు, ఏప్రిల్ నెలకు 1,958 మందికి రూ.97.90 లక్షలు, మే నెలకు 1,946 మందికి రూ.96.40 లక్షలు రూపాయల నిధులను విడుదల చేసింది. జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ తరుపున శాంతి ప్రసాద్ సింగలూరి గారు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతూ, న్యాయవాద సంక్షేమ నిధికి రూ.100 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com