Logo
Date of Publish : 12 September 2023, 10:16 pm
Editor : Sake Naresh

సర్వేపల్లి నియోజకవర్గంలో మరో ఉద్దానం..?

      సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ నందు కొండ కింద ఎస్టి కాలనీ నందు మంగళవారం పర్యటించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. జనం కోసం జనసేన 35వ రోజు కసుమూరు పంచాయతీలోని కొండ కింద పల్లి నందు వైసిపి వైఫల్యాలను గడపగడపకు తెలియజేస్తూ కొనసాగించచారు. అందులో భాగంగా అనేక సమస్యలు వారి దృష్టికి స్థానికులు తీసుకురావడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం కసుమూరు పంచాయతీ పరిధిలోని కొండ కింద ST కాలనీ నందు నివాసం ఉంటున్న ప్రజలు కిడ్నీ వ్యాధితో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ కనీసం ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 6 మంది చనిపోవడం జరిగింది. ఈ కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణం తాగునీటి సమస్య బోరు ద్వారా వచ్చే కొళాయి నీళ్లు తాగడం వలన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చెప్పి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఇక్కడకు వచ్చి చూస్తే మరో ఉద్దాన౦ లాగా సమస్య ఉంది అనిపిస్తుంది. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈ వెంకటాచలం మండలంలో కసుమూరు పంచాయతీ నందు ఆయన గడపగడపకు తిరిగాడు కానీ ఇక్కడ ST కాలనీ నందు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సమస్యలు ఆయనకు పట్టవా ? కిడ్నీ వ్యాధితో కుటుంబ యజమానులు చనిపోతే ఆ కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. భర్త చనిపోయిన మహిళలకి కనీసం పెన్షన్ కూడా రాసిన పరిస్థితులు లేవు. 15 రోజుల లోపల వీళ్ళకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే దానికి ముందుకు వెళ్తారా లేదంటే జనసేన పార్టీ వాళ్లకి తాగడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయమంటారా ? అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, మండల ప్రధాన కార్యదర్శి కాకి శివ, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సుమన్, సాయి, స్థానికులు మస్తాన్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com