సర్వేపల్లి ( జనస్వరం ) : నూతన సంవత్సర సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కేకులు కట్ చేసి డబ్బులు దుబారా చేయకుండా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేదవారికి గుప్పెడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చాలని ఒక గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజనం వడ్డించడం ఎంతో సంతోషంగా వుంది. అయితే నేలమెట్ట కండ్రిగలో పంచాయతీ కాలువలు పోటీగా మురుగునీరుతో నిలిచిపోయి అంటూ ఏర్పడేటువంటి పరిస్థితి. దానికి తోడు పాత కాలనీళ్లు ఊరొస్తా ప్రజలు అస్తవ్యస్తంగా వర్షాలు వస్తే ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అవుతుంటే ఇప్పటివరకు వాళ్లకి కనీసం ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. అదే విధంగా ఆ కండ్రిగనందు పదిమంది దాకా పంట మహిళలు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇప్పటివరకు రాసిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్నీ పెట్టారు. మరి ఈ వాలంటరీ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. ఇంకో 60 రోజుల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం ప్రజలే పాడుతున్నారు. రాబోయేది జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది ఆ ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మొదటి నుంచే కృషి చేస్తాం అని చెప్పి ఈరోజు సంఘం వాసులకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేడూరు నాయకులు కల్తిరెడ్డి, శ్రీనివాసులు, కోసూరు నారాయణ, మద్దినేటి శరత్, నవీన్ కుమార్, సునీల్, శరత్, వినోద్, సుభాష్, వినయ్, దినేష్, మస్తాన్, స్థానికులు శ్రావణ్, విజయ్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం అక్బర్ రహమాన్, వెంకటాచల మండలం నాయకులు శ్రీహరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com