ఎమ్మిగనూరు ( జనస్వరం ) : తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స కొరకు వచ్చిన సుమారు 60 మంది గర్భిణీ స్త్రీలకు అన్నం ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటినుంచి వారంలో ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రషీద్, రవి, కిరణ్ పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com