రైల్వేకోడూరులో నివర్ తుఫాన్ వల్ల లోతట్టు ప్రాంతలో ఇబ్బంది పడుతున్న వారిని జనసేన పార్టీ తరుపున పరామర్శించిన అంకిపల్లి అఖిల్
గత రెండు రోజులు నుంచి” నివర్ తుఫాను” కారణంగా భారీగా పడుతున్న వర్షాలు కారణంగా రైల్వేకోడూరులో పలు లోతట్టు ప్రాంతాలు నీటిమయం అవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా “నరసారాం పేట, గాంధీనగర్ మరియు పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వెనుక నివసిస్తున్న GHMC కాలనీలో ని పరిశుద్ధ కార్మికుల ఇళ్లలో నీరు రావడంతో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను రైల్వేకోడూరు జనసేన పార్టీ తరుపున యువనాయకులు అంకిపల్లి అఖిల్ కళ్యాణ్, మరియు 10 వార్డు వాలెంటరీ రొండా. నవీన్ కుమార్ వారి సమస్యలులను ప్రభుత్వ౦ దృష్టికి తీసుకువెళ్లి ఈ వర్ష సమయంలో వాళ్ళను ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని తెలియచేయడం జరిగింది. అలానే ఇంకా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి అని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు కాబట్టి, ఏది ఆయన అత్యంత అవసరం అయినపుడు మాత్రమే బయటకి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత స్థల౦లో ఉండాలని కోరుకుంటున్నాను అని రైల్వేకోడూరు జనసేన పార్టీ యువనాయకులు అంకిపల్లి అఖిల్ కళ్యాణ్ తెలియజేశారు.