విజయనగరం, (జనస్వరం) : అనుకోని ‘అసని తుఫాన్’ వచ్చిన నేపథ్యంలో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక 27వ డివిజన్, జొన్నగుడ్డిలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జొన్నగుడ్డి వీధుల్లో చెత్తచెదారాన్ని చీపుర్లతో శుభ్రం చేయడం జరిగింది. అనంతరం మురుగుకాలువల్లోను, వీధుల్లోను బ్లీచింగ్ పౌడరను చల్లి, ప్రజలందరికి ఇలాంటి తుఫాన్ల సమయాల్లోను, విపత్కర పరిస్థితుల్లోను ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేడినీరు, వేడివేడి ఆహారపదార్ధాలు తీసుకోవాలని, దోమలు లేకుండా మన పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అథ్యక్షులు & జనసేనపార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) అక్కడున్న ప్రజానీకానికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లోపింటి కళ్యాణ్,ఎగ్జిక్యూటివ్ సభ్యులు రెయ్యి రాజు, పావాడ సాయి, పి.అనీల్, క్లబ్ సభ్యులు అగత పురుషోత్తం, ముక్కి కుమార్, వంకర విఘ్నేష్, ఉనుకూరి వాసు, డోల చరణ్, పావాడ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.