అర్థరాత్రి దోపిడీ దొంగలా తయారైన అనిల్ కుమార్ యాదవ్ : జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

– ప్రత్యామ్నాయ ఇళ్ళు ఇవ్వకుండా ఒక్క ఇటుకా కూలదన్న అనిల్ మాటలు ఏమయ్యాయి?
– గత ప్రభుత్వ సమయంలో సాలుచింతల ప్రజల మధ్య అనిల్ ఆడినది డ్రామా అని తేలిందిగా!
– నెల్లూరులో 20 కోట్లు, చెన్నైలో మరో 20 కోట్లు అక్రమంగా దోచుకున్న సొమ్ముతో అనిల్ కుమార్ యాదవ్ కి భవనాలు
– పేదల ఇళ్ళ విషయంలో కనీస మానవత్వం లేకుండా ఎమ్మెల్యే అనిల్ ప్రవర్తించారు
– మైపాడుగేట్ జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో నిరుపేదల ఇళ్ళ కూల్చివేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేన పార్టీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 92 వ రోజున 51వ డివిజన్ రచ్చమాను వీధి ప్రాంతంలో జరిగింది. మైపాడు గేట్ జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో నిరుపేదల ఇళ్ళను ప్రభుత్వం కూల్చిందన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న కేతంరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు తమ పిల్లలతో ఇళ్ళలో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి దోపిడీ దొంగల్లాగా వారి ఇళ్ళపై పడి జేసీబీలతో ధ్వంసం చేయడం ఏమి రాజనీతి అని ప్రశ్నించారు. ఈ అర్థరాత్రి కూల్చివేతలో దోపిడీ దొంగల ముఠాకు నాయకుడిలా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించారని దుయ్యబట్టారు. పేదల నుండి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని 9 అంకణాల స్థలంలో ఇళ్ళు కట్టించి తాళాలు ఇచ్చిన తర్వాతే ఇప్పుడున్న ఆక్రమణలను తొలగిస్తామని అనిల్ కుమార్ యాదవ్ మాటివ్వలేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక 9 అంకణాలు కాస్తా 6 అంకణాలుగా మారిందని, ఇప్పుడు కనీసం ఆ 6 అంకణాల స్థలంలో కూడా ఇళ్ళు కట్టివ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, ఎటువంటి దారి చూపకుండా పేదలను కట్టు బట్టలతో నిరాశ్రయులను చేసిన ఘనత అనిల్ కుమార్ యాదవ్ కే దక్కిందని అన్నారు. గత ప్రభుత్వ సమయంలో సాలుచింతల ప్రాంతంలో పేదల ఇళ్ళు తొలగిస్తున్నపుడు ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ చేసిన హడావుడి నిజమని ఇన్ని రోజులుగా ప్రజలు నమ్ముతూ వచ్చారని, అనిల్ మానవతావాది అని అనుకున్నారని, కానీ అది ఉత్త డ్రామా మాత్రమే అని, మంచితనం అనే ముసుగు వేసుకుని పేదలంటే ఏమాత్రం కనికరం లేని దొంగ అనిల్ కుమార్ యాదవ్ అనే విషయం నేటితో నెల్లూరు సిటీ ప్రజలందరికీ తెలిసిందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ప్రజల నుండి దోచుకున్న 500 కోట్లలో 20 కోట్లతో నెల్లూరులో ఒక బంగాళా, మరో 20 కోట్లతో చెన్నైలో ఒక విల్లాను అనిల్ కుమార్ యాదవ్ కట్టుకున్నారని, కానీ నేడు పేదలను కట్టుబట్టలతో నడిరోడ్డుపై పడేసారని కేతంరెడ్డి ఆరోపించారు. పేదలకు అండగా జనసేన పార్టీ తరఫున నిలుస్తామని, ఈ అరాచక ప్రభుత్వ పాలన మరెంతో కాలం సాగదని, ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు భరోసా కలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way