పిఠాపురం ( జనస్వరం ) : అంగన్వాడి వర్కర్స్ రోడ్డున పడి బిక్షాటన చేసే స్థితికి వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం అని పిఠాపురం జనసేన నాయకులు అన్నారు. జీతాలు పెంచే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్న అంగన్వాడి వర్కర్స్ కు మద్దతు తెలిపారు. ఎక్కడ కష్టం ఉన్న ముందుండేది జనసేన పార్టీ అని అన్నారు. పిఠాపురం టౌన్ బైపాస్ రోడ్డులో అంగన్వాడి వర్కర్స్ షాపులు స్థానిక ప్రజలు వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఆడపడుచులు బిక్షాటన చేస్తుంటే చూసి చలించిపోయిన పి. ఎస్. ఎన్.మూర్తి ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం అని అన్నారు. వీళ్ళకి ఏ బాధ వచ్చినా జనసేన ఎప్పుడు సపోర్టుగా ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ మీ ఇంట్లో అన్నయ్య లాగా ఎప్పుడు తోడుంటారని వారికి భరోసా కల్పించారు.