ఆముదాలవలస ( జనస్వరం ) : గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడి ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చి, దాదాపు ఐదేళ్లు కావస్తున్న ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలంతా సమ్మె నిర్వహించారు.స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద తలపెట్టిన అంగన్వాడీలకు సమ్మెకు ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్రావు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నేటి రోజుల్లో పేద ధనిక వర్గాల వారందరికీ పోషణ లోపం లేకుండా చూడటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైనదని, అంతేకాకుండా ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వడంతో ప్రారంభిస్తూ ఆ తల్లి,బిడ్డ ల సంరక్షణ ధ్యేయంగా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారని అంగన్వాడీల సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ తో పాటు సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్, గంగు కోటేష్, దువ్వాడ కరుణా సాగర, పప్పల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com