తాడేపల్లిగూడెం, మార్చి25 (జనస్వరం) : ఆంధ్రను అన్నపూర్ణగా చూడాలి అంటే కూటమిని గెలిపించాలి అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో జనసేన పార్టీలోకి భారీగా చేరిన వైస్సార్సీపీ నాయుకులు, కార్యకర్తలు. జనసేన పార్టీ సీనియర్ నాయుకులు పైబోయిన వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైస్సార్సీపీ నాయుకులు బొట్ట శ్రీనివాసు వారి అనుచరులు జనసేన పార్టీలోకి చేరారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయిన మాట్లాడుతూ పల్లెలో కనీసం కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి, డ్రైనేజి లు పూడిక తీయలేని పరిస్థితి, ప్రజలకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తున్నాం, కష్టబడి పనిచేసుకొని ఇంటికి వచ్చి చుక్క మందు తాగుదాము అంటే కల్తీ, అలా కల్తీ మందు తాగి రాష్ట్రం లో చాలా ప్రాణాలు తీసేసిన పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వంది, అప్పులు చేసి పప్పు బెల్లములు పంచుతున్నాడు, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం స్వర్ణయుగంగా నడిచింది, ఉచిత కరెంట్, రెండు రూపాయిలు కె కేజీ బియ్యం, రైతులకు ఉచిత కరెంట్ లాంటి సంక్షేమ తో రాష్ట్రాన్ని కాపాడిన మహానుభావుడు ఎన్టీ రామారావు,స్వర్ణంద్ర పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించిన నాయుకులు నారా చంద్రబాబు,అలాంటి పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రం లో లేవు.తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో కూడా అలాంటి మంత్రి ఉన్నాడు అయిన పని దోచుకోవడం – దాచుకోవడం. అయిన మాట్లాడితే జనసేన వస్తే రౌడీ ఇజం వస్తుంది అని ప్రజల్ని బయపెడుతున్నాడు, కానీ వాళ్ళు రౌడీలతో మా కార్యకర్తలు పై దాడులు చేసి సందర్బలు ఉన్నాయి, మా కార్యకర్తలను కాపోడుకోవడానికి మేము చాలా కష్టపడ్డం. ఎక్కడ ఇల్లు కట్టాలి అన్న కమిషన్ ఇవ్వాలి, ఎక్కడ షాపు కట్టాలి అన్న టాక్స్ కట్టాలి ఇది మనం గెలిపించుకున్న తాడేపల్లిగూడెం మంత్రి నిర్వకం. మన పిల్లలు మన దగ్గరే ఉండాలి తాడేపల్లిగూడెం అభివృద్ధి కావాలి అంటే ఆంధ్ర ని అన్నపూర్ణగా చూడాలి అనుకుంటే కూటమికి మద్దతు ఇవ్వాలి అని ప్రజలకు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.