బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి రాజు, టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ బేబీ నాయన, జనసేన నాయకులు ఆదాడ మోహన్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ ను కలిసి ఆయా నియోజకవర్గాలలో పార్టీ బలాబలాలపై చర్చించారు. ముందుగా బొబ్బిలిలో ఓ హోటల్ ప్రారంభోత్స కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలిలో టీడీపీ, జనసేన విజయావకాశాలపై చర్చించారు. బొబ్బిలిలో రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో గెలవడం ఖాయం అన్నారు. అనంతరం పార్వతీపురం లో జనసేన టీడీపీ గెలుపుపై మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీష్ తో ఏకాంతంగా చర్చించారు. పార్టీ టిక్కెట్ కేటాయిస్తే సునాయాసంగా గెలిపించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం యూటీఎఫ్ సంఘ నాయకులు ఓపిఎస్ మరల పునరుద్ధరణకై జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దంతులూరి రమేష్ రాజు, రేగిడి లక్ష్మణరావు, వంగల దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com