
మహిళల భద్రతను గాలికి వదిలేశారు
- రాష్ట్రంలో మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి.
- మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయి.
- దేశంలోనే మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రదే అగ్రస్థానం
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు
విజయవాడ, (జనస్వరం) : స్థానిక పండిట్ నెహ్రు బస్టాండ్ కూడలిలోతుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి క జనసేన పార్టీ విజయవాడ నగర కమిటీ అధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళ నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయని, దేశంలోనే మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, నేరస్తులు విచ్చలవిడిగా ధైర్యంగా రోడ్లపై తిరుగుతున్నారన్నారు. మహిళలంటే సీఎం జగన్ కి గౌరవం లేదన్నారు. మహిళల భద్రత రక్షణ గాలికి వదిలేసి పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళ రక్షణ జగన్ పాలనలో ప్రచారానికే పరిమితం అయిందని వాపోయారు. "దిశ"తో మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం వల్ల ఒక్కరికైనా శిక్షలు వేశారని ఒక్కరైనా సరే సకాలంలో కాపాడగలిగారా..? అని ప్రశ్నించారు. నగర ఉపాధ్యక్షులు వెన్న.శివశంకర్ మాట్లాడుతూ వైసీపీ చేసే కార్యక్రమాల్లో రికార్డింగ్ డాన్సులు, అర్ధనగ్న నృత్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. సీఎం, డీజీపీ, హోంమంత్రి నివాసం ఉండే గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయంటే... ఇంకా రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏవిధంగా ఉంటుందని ప్రశ్నించారు. దివ్య తేజస్విని ఘటనలో గాని, రమ్య ఘటనలో గాని, సీతానగరం ఘటనలో గాని దోషులు కనీసం పట్టుకొని శిక్షించగలిగారని విమర్శించారు. రాజధాని అమరావతి కోసం ఉద్యమించిన మహిళలపై మానవత్వం లేకుండా ఈడ్చిపడేసిన ఘటనలు చాలానే ఉన్నాయన్నారు. బొల్లిశెట్టి వంశీ కృష్ణ మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో నేరస్తులకి భయం లేకుండా పోయిందన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ జగన్ గారి పాలనలో సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ఉపాధ్యక్షులు వెన్న శివ శంకర్, కమలా స్వామినాథన్, సయ్యద్ మొబిన, బొలిశెట్టి వంశీకృష్ణ, విజయ్ కుమారి, కృష్ణ మోహన్, ఆలియా బేగం, కామేశ్వరి శిరీష, రేవడి రమాదేవి, ఉదయలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఉమా మహేశ్వరి, రాణి తదితరులు పాల్గొన్నారు.