గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : ఎట్టేరి గ్రామపంచాయతి, ఎట్టేరి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను, సూపర్ సిక్స్ లో ఉన్న భవిష్యత్తు గ్యారెంటీ అంశాలను, వివరించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలని, రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, గంగాధర్ నెల్లూరు మండలంలో ఉన్న ప్రజలు తప్పకుండా పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని, యువతను సమాజానికి ఆదర్శంగా నిలబెట్టి, వారి చేత మెరుగైన సమాజాన్ని స్థాపించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ పని చేస్తా ఉన్నారన్నారు. గంగాధర్ నెల్లూరు మండలంలో ఉన్న 32 గ్రామపంచాయతీలోని 32 గ్రామాలను, 2024 సరికొత్త ప్రజా ప్రభుత్వంలో, పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆదర్శ గ్రామాలుగా సంవత్సరంలోపే సర్వరంగ సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు గుణశేఖర్, రాము, గంగాధర్ నెల్లూరు మండల బూత్ కన్వీనర్ తులసి రామ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జనసేన నాయకులు మునుస్వామి, యువరాజ్ రఘు, అరుణ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com