- పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు వెంకట మహేష్, జనసేన నాయకులు
విజయవాడ, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, పార్టీ నాయకులు పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నాడు ప్రత్యేక ఆంధ్ర కోసం నిరాహార దీక్షను పూని ప్రత్యేక ఆంధ్ర సాధించడంలో తన ప్రాణాన్ని త్యాగం చేశారాని, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ అని, ఎందరో మహానుభావులు ఆంధ్ర రాష్ట్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, ఇలాంటి సమరయోధులు స్ఫూర్తిని మనలో నింపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు లింగం శివ ప్రసాద్, సయ్యద్ మోబిన, కార్యదర్శులు కొర్ర గంజి వెంకటరమణ, వేవిన నాగరాజు, ఆకారపు విజయ కుమారి, సంయుక్త కార్యదర్శులు సాబింకర్ నరేష్, బావి శెట్టి శ్రీను, రాజా నాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com