
బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్షంగా బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ Dr. గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్ర సాగిస్తున్నారు. అందులో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం ” అనే కార్యక్రమాన్ని 21వ రోజు బొబ్బిలి మండలం ఇందిరమ్మ కాలనీలో ఇంటింటా ప్రచారం చెయ్యడం జరిగింది. బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ Dr.గిరాడ అప్పలస్వామి గారి సమక్షం జనసేన పార్టీ ని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు. జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.