
గుంటూరు అర్బన్, (జనస్వరం) : గోతులమయంగా మారిన రోడ్లతో, అధ్వాన పారిశుద్యంతో ప్రజలు నరకయాతన పడుతున్నారని, స్థానిక సమస్యల పరిష్కారానికై ప్రజల పక్షాన పోరాడేందుకు జనసేన పోరాటాలకు సిద్దంగా ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ గారు అన్నారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ అభ్యర్థులతో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావుతో కలసి ఆయన సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా బోన బోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడములో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తచేశారు. ఈ కార్యక్రమములో కార్పొరేటర్లు దాసరిలక్ష్మీ, యర్రంశెట్టి పద్మావతి జనసేన నాయకులు నారదాసు, ప్రసాద్, ఆళ్ళహరి, నక్కలవంశ, విజయలక్ష్మీ, రజని, దాసరి వెంకటేశ్వర్లు, కొవ్వుల కిరణ్, చేజర్ల శివ కుమార్, మల్లికా, పద్మావతి, వానుశిఖబాలు తదితురులు పాల్గొన్నారు.