అనంతపురం ( జనస్వరం ) : అనంతపురము నగరంలోనే స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న డంప్ యాడ్ ను జనసేన అనంతపురం అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పాలకులు మారుతున్న డంపింగ్ యార్డ్ మారలేదు.. పేరుకు మాత్రమే మారుస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారు. జనాభాని దృష్టిలో పెట్టుకుని డంపింగ్ యార్డ్ ని జనావాసాలకు దూరంగా తరలించాలి. వేల కొద్దీ వేస్తున్న చెత్త వల్ల యార్డ్ పరిసరాల్లో జనాలు ఉండలేక పోతున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ని మార్చి చెత్తను రీసైక్లింగ్ చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైన నైపుణ్యంతో కలిగిన మిషనరీని అందుబాటులోకి తెచ్చి ప్రజలకు విముక్తిని కల్పించాలన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మరియు నగర మేయర్ వివరణ ఇవ్వాలి. లేని పక్షాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి శ్రీకారం చుడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు రాపా ధనంజయ్, సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు ఆవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, నగర కార్యదర్శిలు మురళి, సంపత్, ఆకుల అశోక్ మరియు నాయకులు చరణ్, వడ్డే వెంకటేష్, హిద్దు, నౌషాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.