Logo
Date of Publish : 10 October 2021, 3:40 pm
Editor : Sake Naresh

వాల్మీకి, బోయలను ఆదుకోవాలని, అభివృద్ధికి పాటు పడాలని జనసేన మద్దతు కోరుతూ అనంత జిల్లా నాయకుల మీడియా సమావేశం

      అనంతపురం ( జనస్వరం ) : వాల్మీకి, బోయలను ఆదుకోవాలని, వాల్మీకి బోయలు అభివృద్ధి కి పాటుపడాలని కోరుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆదివారం రోజున 14 నియోజకవర్గాల వాల్మీకి ముఖ్యనాయకులు కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 20న వాల్మీకి జయంతినీ ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తమన్నారు. రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చాలని 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చి ఇంతవరకు కనీసం వాల్మీకి బోయల కోసం పోరాటం చేయకుండా గాలికి వదిలేశారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి దానిపై ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. అందువల్ల వాల్మీకి బోయలు రాజకీయాలకతితంగా అనంతపురం జిల్లాలోని ప్రతి గ్రామం నుండి జనసేన పార్టీకి స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి వాల్మీకి కుల పెద్దలు వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి వాల్మీకి బోయల సమస్యలని వినతిపత్రం ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారికి, అనంతపురం జిల్లా అధ్యక్షులు TC.వరుణ్ గారి ద్వారా వాల్మీకి కుల పెద్దలు వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే రకంగా కార్యక్రమం ఉంటుందని తెలియచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా ప్రధాకార్యదర్శి రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి, జయమ్మ, రాజేష్, మారెష్, వెంకటేశు, మేకల ఈశ్వర్, T రమేష్, శేషాద్రి, శివయ్య, అదినారయన, చరణ్, ప్రతాప్, నాగేంద్ర, చంద్రశేఖర్, గోపాల్, ఆంజనేయులు, వంశీ కృష్ణ, దేవేంద్ర, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com