అనంతపురం ( జనస్వరం ) : శనివారంనాడు జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత అనంతపురం సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో పలు వార్డులకు వెళ్లి అక్కడ రోగులకు బ్రెడ్ అందిచి వారికి అక్కడ వైద్యసేవలు ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉందని వైకాపా ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ వైకాపా ప్రభుత్వం చెప్పే మాటలు పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పత్రికా ప్రకటనలకే వీరి మాటలు పరిమితమయ్యాయి. వైద్యశాలలో ఏ వార్డుకు వెళ్లిన ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం ఉంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లేదు. రోగులకు అవసరమైన మందులు బయట మెడికల్ స్టోర్ కి వెళ్లి తెచ్చుకోవాలని స్లిప్పులు రాసిస్తున్నరని దోమల బెడద ఎక్కువగానే ఉందని ఇక్కడ రోగులు చెప్తున్నరన్నారు. గర్భవతులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడానికి 3రోజుల నుంచి వారం రోజుల వరకు టైం చెప్తున్నారని రోగులకు అత్యవసరమైన పరీక్షలు చేయడానికి అధునాతన పరికరాలు అందుబాటులో లేక బయట ప్రైవేటు డయాగ్నస్టిక్క్స్ సెంటర్స్ కి పంపిస్తున్నారని అన్నారు. వైద్యశాలలో అందించే ఆహారం ఏమాత్రం నాణ్యతలేదని ఆదేవిధంగా ప్రయివేటు వైద్యశాలకు ఆరోగ్యశ్రీ నిధులు వేళ కోట్లు బకాయిలు చెల్లించక ఆయా వైద్యశాలలు ఆరోగ్యశ్రీ ని రద్దు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కల్పనలో మొదటి స్థానంలో ఉందని చెప్తున్నారు. ఒకసారి ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి చూడండి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో… మన రాష్ర్టంలో వైద్య సదుపాయాలు అంత మెరుగ్గా ఉంటే మీ మంత్రులు ఎమ్మెల్యే ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్యం ఎందుకు చేయించుకుంటున్నారో అని ఎద్దేవా చేశారు.. జగన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని ఉన్న ఈ 3డు నెలలైనా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.