అనంతపురం, (జనస్వరం) : అనంతపురం రూరల్ మండల జనసేనపార్టీ అధ్యక్షుడు గంటా రామాంజనేయులు మండలంలోని పామురాయి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఇంటింటికి తిరిగి క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు భీమా చేయించిన గొప్ప పార్టీ జనసేన అని, కష్టపడి పని చేస్తూ పార్టీ కోసం కృషి చేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునే విధంగా కళ్యాణ్ వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల భీమా చెక్కు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇలాంటి పేదవారికి అండగా ఉండేందుకు కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.