అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువు కట్ట క్రింద ఎన్టీఆర్ మార్క్ రోడ్డు నందు చెట్ల పెంపకం కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ప్రతి చెట్టుకు దాదాపు 10 వేల రూపాయలు కేటాయించి అవినీతి అక్రమాలకు పాల్పడి, నిర్వహణ లోపంతో లక్షల రూపాయిలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మేయర్ వసీం నగర అభివృద్ధి అంటే ఇదేనా? ప్రజా సంపద దుర్వినియోగం అవుతుంటే మీరేం చేస్తున్నారు? మేము నగరాన్ని 800 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతుంటారని జనసేన నాయకులు అన్నారు. అభివృద్ధి అంటే ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడమా? మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన ఘటనకు కారకులైన వారి పైన తగిన విచారణ జరిపి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున జిల్లా ఉపాధ్యక్షుడు జయరాంరెడ్డి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com