Logo
Date of Publish : 08 October 2022, 6:38 am
Editor : Sake Naresh

రజక కాలనీ ముంపు ప్రాంతంలో పర్యటించిన అనంతపురం జనసేన నాయకులు

     అనంతపురం, (జనస్వరం) : ఒక మోస్తారు వర్షానికే అనంతపురం నియోజకవర్గంలో సోమనాథ్ నగర్ లోని రజక కాలనీ నీట మునిగింది. గత రెండు రోజులుగా కనీసం అధికారుల పర్యవేక్షణ లేకుండా కాలనీవాసులు అయోమయ దీన పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి జనసేనపార్టీ పర్యవేక్షణలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నీట మునిగిన కాలనీవాసుల్ని పరామర్శించి, మీకు అండగా జనసేనపార్టీ ఉంది అని కాలనీవాసులలో మనోధైర్యాన్ని నింపి, మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే జనసేనపార్టీ అధికారంలోకి రావాలని జనసేనపార్టీ ఆవశ్యకతను తెలియజేసి, కాలనీ వాసులకు భరోసా కల్పించడం జరిగింది. తక్షణమే అనంత నగర కార్పొరేషన్ అధికారులు స్పందించి ముంపు ప్రాంతానికి గురైన రజక కాలనీ వాసుల్ని ఆదుకోవాలని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, లాయర్ మధు, నగర కార్యదర్శిలు విశ్వనాధ్, రమణ, లాల్ స్వామి నగర సంయుక్త కార్యదర్శులు ఆకుల అశోక్, కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సంతోష్, జనసేన నాయకులు పాలగిరి చరణ్ , మెరుగు శ్రీనివాసులు, భవాని నగర్ మంజునాథ్, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com