
అనంతపురం, (జనస్వరం) : నిన్నటిరోజు జిల్లాలో కురిసిన వర్షానికి అనంతపురము నగరంలోని వరద ముంపుకు గురైన ప్రాంతాలన్నింటిలో జిల్లా అధ్యక్షులు TC వరుణ్ ఆదేశాలమేరకు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నగర ఉపాధ్యక్షులు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, దరాజ్ బాష, కార్యదర్శులు విశ్వనాధ్, మురళీకృష్ణ, సంపత్ సహాయక కార్యదర్శి అశోక్, పవన్ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30ని ల నుండి నిర్వీరామంగా సాయంత్రం 7.30ని ల వరకు వరద నీటి వల్ల నిరాశ్రయులకు దాదాపు 5000 మంది పైచిలుకు ప్రజలకు స్వయంగా వెళ్ళి భోజనాలు వారికి అందచేయడం జరినది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన కార్యకర్తలు హిద్దు, నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగినది.ఇందుకు ముంపు ప్రాంతంలో భోజన సామాగ్రిని పెట్టుకొని సప్లై చేయడానికి తన ట్రాక్టర్ ను నగర సహాయక కార్యదర్శి రమణ ఇచ్చి సహకరించారు.