Search
Close this search box.
Search
Close this search box.

అనంతపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి నివాళులు

అనంతపురం

           అనంతపురం ( జనస్వరం ) :  నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్ నందు జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి 132వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు  టి.సి.వరుణ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సమాజంలో ఉన్న దురాచారాలకు, కుల వివక్షకు వ్యతిరేకంగా 150 సంవత్సరాలకు పూర్వమే ప్రజలను కూడగట్టి పోరాడి అనేక విజయాలు సాధించిన జ్యోతిరావు పూలే దేశంలోని పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తితోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీసీల మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. భరత జాతి సంపదైనా జాతీయ నాయకులకు కుల, మత, వర్గాలను అంటగట్టి వేర్వేరు భావాలతో వీడదీయరాదన్నారు. బడుగు బలహీన వర్గాలు విద్యారంగంలో ప్రగతి సాధించడం వెనక పూలే గారి కృషి ఎంతో ఉన్నదని కొనియాడారు, వారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని సమాజంలో మార్పు కోసం పూలే గారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి బాటలో నడవాలని అన్నారు. స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేశారు అని భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు రాపా ధనంజయ్, సంజీవరాయుడు, కిరణ్, సంయుక్త కార్యదర్శులు కోన చంద్రశేఖర్, విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిలు రోల్ల భాస్కర్, మేదర వెంకటేశులు, చోటు, హుస్సేన్, ధరజ్ భాష, నగర కార్యదర్శులు విశ్వనాథ్, సంపత్, నవర సంయుక్త కార్యదర్శిలు అశోక్, నెట్టిగంటి హరీష్, ఆకుల ప్రసాద్, వెంకటకృష్ణ, మరియు నాయకులు హీద్దు, నౌషాద్, మళ్లీ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way