
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ మొదటగా అనంతపురం జిల్లా నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభకు విచ్చేసి సభను దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తర్వాత ఆవిర్భావ సభలో జనసేన ఆధినేత మాట్లాడిన మాటలను వక్రీకరించిన వైసిపి నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాట్ల కుక్కల్లా రోడ్లపైకి వచ్చి మొరగడం కాదని, వైయస్సార్సీపి మంత్రులు మీరు ఏ ఏ శాఖలకు మంత్రులో మీకు తెలుసా? ఎప్పుడన్నా మీ శాఖలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు బయటకొచ్చి మాట్లాడుతున్నారా? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు మీరు చేస్తున్న అవినీతి, అరాచకాలు, మదమెక్కి మీరు పరిపాలిస్తున్న తీరు విధి విధానాల గురించి మాట్లాడితే వాటికి సమాధానం చెప్పే శక్తి, దమ్ము ధైర్యం లేక అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరిస్తున్నామని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మీ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యల పట్ల స్పందించి తక్షణమే పరిష్కరించండి. మీ బాధ్యతను గుర్తుకు తెచ్చుకొని ప్రవర్తించండి. మగతనం గురించి మాట్లాడే అంత మగాళ్ళా మీరు? అని ప్రశ్నించారు.