
పెనుకొండ, (జనస్వరం) : మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని జనసేన పార్టీ తరపున13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీరమహిళ శ్రీమతి శ్రీదేవి ప్రమాదవశాత్తూ గాయపడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ ఫోన్ ద్వారా పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకొని 10,000/- వేల రూపాయలు ఆర్థికసాయం అందించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ గారి తరపున జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య 10,000/- రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శిలు సిద్దు, శివ, జిల్లా నాయకులు వెంకట్ నారాయణ, పవనిజం రాజు, వీరమహిళలు చంద్రకళ, రూప, గీత, నాయకులు లోకేష్, విష్ణు, శివ శంకర్, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.