Logo
Date of Publish : 08 March 2022, 5:18 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్

    గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ పట్టణం. 2019 నుండి జనసేన పార్టీ కార్యక్రమాలులో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన జనసైనికుడు శ్రీ కావాలి రవికుమార్ అస్వస్థతకు గురై హఠాత్తుగా కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయాన్ని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు స్థానిక నాయకులు బండి శేఖర్ ద్వారా తెలుసుకున్న అధ్యక్షులు టి.సి వరుణ్ గారు జిల్లా పర్యటన భాగంగా గుంతకల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్నప్పుడు స్వయానా అమరుడైన కావలి రవి కుమార్ గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి అతి చిన్న వయసులోనే మరణించిన నిరుపేద కుటుంబానికి చెందిన నిస్వార్థ జనసైనికుడు కావలి రవికుమార్ గారి కుటుంబానికి పార్టీ ఏదో రకంగా భవిష్యత్తులో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి కష్టమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు అండగా ఉండాలని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టారు. కావున ప్రతి ఒక్క జనసైనికుడు కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని సభ్యత్వ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com