Logo
Date of Publish : 07 August 2021, 4:35 pm
Editor : Sake Naresh

క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ.టి.సి.వరుణ్

         అనంతపురం, (జనస్వరం) :  జనసేన పార్టీ  జిల్లా కార్యాలయంలో  పూర్తయిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు ను జిల్లా అధ్యక్షులు శ్రీ.టి.సి.వరుణ్ గారు  సమక్షంలో క్రియశీలక సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు సిటీలో దాదాపు 1100 మంది పైచిలుకుతో పూర్తి చేయటం శుభప్రదం అని ఆయన  తెలిపారు. తన వ్యక్తిగత సంపాదన నుంచి కార్యకర్తల శ్రేయస్సు నిమిత్తం కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అనీ, ఈ సభ్యత్వంతో పాటు సభ్యులకు ఇచ్చిన భీమాసౌకర్యంతో ప్రమాదం జరినపుడు, వైద్యం నిమిత్తం రూ50000లు ప్రాణహాని జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు రూ 500000 ఇస్తూ పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామని, దేశంలో మరే రాజకీయ పార్టీల్లో లేని సౌకర్యం జనసేన పార్టీ కలగజేసింది. రానున్న రోజుల్లో అన్నీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి బలమైన కమిటీలు ఏర్పరుచుకొని, కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలను సైతంలెక్క చేయక పన్నులతో బాదుతూ పీడిస్తున్న ప్రభుత్వంతో పోరాటానికి సామాన్యుడికి అండగా నిలుస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసైనికులు మరియు ముఖ్య నాయకులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com