అనంతపురం ( జనస్వరం ) : గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నార్పల మండల కేంద్రము నడిబొడ్డన ఉన్న కూతలేరు వంతెన నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూతలేరు బ్రిడ్జి నిర్మాణంను వెంటనే చేపట్టి నార్పల మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్ధానిక MRO గారికి జిల్లా జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికార ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా కూతలేరు వంతెన నిర్మాణంను చేపట్టకుండా ఉన్న బ్రిడ్జిని కూల్చి కొత్తగా వంతెన నిర్మాణం చేపడుతున్నామని వంతెన నిర్మాణంను మధ్యలోనే వదిలేశారు. దీని ప్రక్కన ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు కూడా వర్షాలకు కోతకు గురవ్వడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి నార్పల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, కార్యదర్శి ధనుంజయ్, సంయుక్త కార్యదర్శి పుతుషోత్తం రెడ్డి, అవుకు విజయ్ కుమార్, జయమ్మ, రాజు, శ్రీనివాసులు, నార్పల మండల వీరమహిళ తేజ లక్ష్మీ, శిల్ప, మండల నాయకులు తుపాకుల భాస్కర్, ప్రవీణ్, రామకృష్ణ, ముప్పూరి కృష్ణ, అంజి, సంతోష్, అజయ్, ప్రసాద్, ఎర్రిస్వామి, కుస్వంత్, ఆన్సర్, నారాయణస్వామి ,రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com