అనంతపురం ( జనస్వరం ) : కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవ రాయుడు ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత మరియు జనసేన సీనియర్ నాయకులు దంపెట్ల శివ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ దంపెట్ల శివ ప్రసంగిస్తూ పార్టీలో స్థాపించినప్పటి నుంచి పని చేస్తున్నప్పటికీ గ్రామాల్లో సరైన నాయకత్వం నాయకత్వాలు లేకపోవడం వలన పార్టీ బలోపేతం చేయలేకపోతున్నామని అన్నారు. ముఖ్యంగా దళిత సోదరులు అయితే మరీ వెనుకబడి పోతున్నారని తెలియజేసారు. ఖచ్చితమైన దిశా నిర్దేశం చేసే నాయకులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపుసంక్షేమ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి తోట ప్రకాశ్, ఎస్టి ప్రజాసామాఖ్య వ్యవస్థాపకులు మల్లికార్జున గారు, మహజనసేన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధార్థ బాబు, మరియు ఇతర దళిత నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com