Logo
Date of Publish : 21 January 2022, 2:05 pm
Editor : Sake Naresh

జనస్వరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టి.సి వరుణ్

   అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కార్యాలయంలో జనసేనపార్టీకి అనుబంధంగా న్యూస్ అందిస్తున్న జనస్వరం న్యూస్ వ్యవస్థాపకులు సాకే నరేష్ జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ గారిని కలిశారు. సాకే నరేష్ తాము చేస్తున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. అలాగే త్వరలోనే జనస్వరం మ్యాగజైన్ ను ప్రతి నెలా ప్రింటింగ్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. టి.సి వరుణ్ గారు మాట్లాడుతూ ఒక సామాన్య జనసైనికుడు సాకే నరేష్ ఒక మీడియా వ్యవస్థను ప్రారంభించి జనసేన పార్టీకోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. గతంలోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనస్వరం గురించి తెలుసుకొని నరేష్ ను అభినందించిన విషయం తెలిసిందే. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నరేష్ అనంతపురం జిల్లా వాసి కావడం మాకు గర్వకారణం. త్వరలోనే జనస్వరం న్యూస్ అభివృద్ధి చెందాలని, వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కోరుతూ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం జనస్వరం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, అనంతపురం రూరల్ కన్వీనర్ రామాంజనేయులు, జనసేన నాయకులు రవి, మురళి, మహేంద్ర, మనోజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com