
హిందూపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు హిందూపురంలోని R&B అతిథి గృహం నందు నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి నాయకులకు మరియు సైనికులకు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మార్చి 14వ తేదీ ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా నుండి నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారికి శాలువాలతో, బొకేలతో నాయకులు మరియు జనసైనికులు సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, హిందూపూర్ నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.