శింగనమల, (జనస్వరం) : అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో శింగనమల తాడపత్రి నియోజకవర్గాల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ నాయకుడు సాకే మురళీకృష్ణల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, తాడిపత్రి ఇంచార్జ్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు పెండ్యాల హరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ మాట్లాడుతూ కార్యకర్తల శ్రేయస్సు కొరకే పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు లోతుగా ఆలోచించి 500 రూపాయలతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందులు పడకూడదని దూరదృష్టితో ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వ నమోదును శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలన్నదే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ధ్యేయంగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి చూపిస్తామన్నారు. అనంతరం వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులను జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మార్చి 14న పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు సంజీవ రాయుడు, చోప్ప చంద్ర, కిరణ్ కుమార్, సింగనమల మండల అధ్యక్షులు ఓబులేసు, ప్రవీణ్ కుమార్, సంతోష్, దండు హరి, మధు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.