అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ఐటీ విభాగం సూచనల మేరకు అనంతపురం జిల్లా జనసేన ఐటి విభాగం సమావేశాన్ని జిల్లా కో ఆర్డినేటర్ పసల శ్యామ్ సుందర్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరై మార్గనిర్దేశం చేశారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు అస్త్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు వీక్షించే విధంగా చూడాలని అదేవిధంగా నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటి విభాగంని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను మరియు రానున్న ఎన్నికలలో ఐటీ విభాగం దృష్టిసారించాల్సిన విషయాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరామ్ రెడ్డి, అంకే ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు మరియు నియోజకవర్గ ఐటీ విభాగం కోఆర్డినేటర్లు విష్ణు వర్ధన్, సుధీర్, ఆయూబ్, సుబ్రమణ్యం, ప్రసాద్, సోమశేఖర్ పాల్గొన్నారు.