
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కంబదూరు మండలం అధ్యక్షులు చంద్రమౌళి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలను అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల ఎగువ పల్లి గ్రామం జనసేన నాయకుడు గంగాధర రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. గంగాధర ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. అలాగే జనసేన నాయకుడు కార్తీక్ వాళ్ళ నాన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అలాగే ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన జనసేన పార్టీ కార్యకర్త నరసింహ మూర్తి తల్లి గారిని ఓదార్చి జనసేన పార్టీ తరఫున 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, ధైర్యం చెప్పి ఎల్లప్పుడూ మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెంకటేష్, నరేష్, ప్రకాష్, నవీన్, సురేష్, వినోద్, అజయ్, యశ్వంత్( మడకశిర ), జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.