అనంతపురం ( జనస్వరం ) : విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించడానికి వస్తుంటే కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా బయటే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని మా నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అడ్డుకోవడం అప్రజాస్వామికం అని అన్నారు. జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు పేదలకు 200 యూనిట్లు ఫ్రీ గా ఇస్తాము దానితో మూడు డైట్ లో రెండు ఫ్యాన్లు 16 గంటల పాటు టివి ఉచితంగా చూసుకోవచ్చు అని ఇచ్చిన హమీ ఏమైందని దయ్యబట్టారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు ఉగాది కానుకగా 1400 కోట్ల విద్యుత్ భారం ట్రూ అప్ కింద 3 వేల కోట్ల రూపాయల భారం వేయటం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, పచ్చబొట్ల పద్మ, జిల్లా సంయుక్త కార్యదర్శి జయమ్మ, వీరమహిళలు రూప, జక్కిరెడ్డి పద్మావతి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కమిటీ సభ్యులను, నగర కమిటీ సభ్యులను మండల అధ్యక్షులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి 1Town పోలీస్ స్టేషన్ కు తరలించారు.