
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం నియోజకవర్గంలో పాతూరు గాంధీ బజార్ నందు క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, మెరుగు శ్రీనివాసులు, భవాని నగర్ మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటాద్రి నాయక్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ , పురుషోత్తం నాయక్ , రాజు, మహేష్ కుమార్, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రతాప్, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.