అనంతపురం అర్బన్ ( జనస్వరం ) : నియోజకవర్గ MLA అనంత వెంకట్రామిరెడ్డి గారు అనంతపురం జిల్లాలో మిమ్మల్ని 9 నంబర్ల నాయకుడు అంటారు. అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకుని ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని మెజారిటి మీ ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని నిద్ర లేచి ఎప్పుడో నెలకొకసారి బయటకు వచ్చే ముఖ్యమంత్రి గారిని ఏమనాలి అది కూడా జనాల్లోకి వచ్చేటప్పుడు పరదాలు కట్టి బయటకు వచ్చే ముఖ్యమంత్రి గారిని ఏమనాలి అని అనంతపురం జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి అన్నారు. జనసేన పార్టీ సామాన్యుల పార్టీ పార్టీ నడపడానికి ప్రజల కోసం ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి తన సొంత కష్టం పై బ్రతికే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పద్దతి కాదు. తన సొంత డబ్బులతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేస్తున్న మహోన్నత వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు అమలు చేసాము అంటున్నారు కదా సంపూర్ణ మద్య పాన నిషేధం, CPS విధానం రద్దు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అధికారం కోసం అడ్డ దారులు తొక్కే మీరెక్కడ తన కష్టార్జితం ప్రజలకోసం రైతుల కోసం వెచ్చించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని అన్నారు.