ఆధునిక ప్రజాస్వామ్యంలో గ్రామసభలు కీలక భాగం. అవి గ్రామస్థాయి ప్రజలకు వికేంద్రీకరణ పాలనకు సంబంధించి ప్రత్యక్షంగా పాల్గొనే వేదికలు. గ్రామ సభల్లో ప్రజలే తమ నిర్ణయాలను తీర్మానించుకొని, గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించే ఒక మంచి బృహత్కార కార్యక్రమం. ఇలాంటి గ్రామ పంచాయితీ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సచివాలయం, వాలంటీర్లు అంటూ మభ్య పెడుతూ వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల్ని అవసరం మేరకు తీసుకోక, వారిని ఎటుకాకుండా చేశారు. వాలంటీర్లకు సరైన ఉద్యోగ భద్రత కల్పించలేకపోయారు. వారికి గౌరవ వేతనం అంటూనే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి ఊదరగొట్టారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను తప్పు పట్టారు. వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వకుండా, వారిలో ఉన్న ప్రతిభను ప్రభుత్వం కేవలం 5వేల రూపాయలకే తాకట్టు పెడుతోందని విమర్శించారు. సామాన్య ప్రజల వ్యక్తిగత, భద్రత డేటాను వాలంటీర్ల చేతుల్లో పెట్టడంను తప్పు పట్టారు. సామాన్య ప్రజలు అదే విషయాన్ని గ్రహించి వాలంటీర్ల వ్యవస్థను మాకొద్దు అంటూ నిరసించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయితీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పవచ్చు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తన నిర్ణయాలు, ఆలోచనలతో దేశం మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశారు. పరిపాలన చేపట్టిన కేవలం 100 రోజుల్లోనే గ్రామ సభలు కార్యక్రమం ప్రపంచ రికార్డ్ సాధించడం ఓ ఘనత. అధికారంలోకి వచ్చిన రోజు నుండి 100 రోజులలోపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు గాను “ ప్రపంచ రికార్డ్ ” గా గుర్తించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. భారత దేశ చరిత్రలో ఇటువంటి గ్రామ స్వరాజ్య పాలన సాధించడం ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం అయింది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తాను తీసుకున్న శాఖల్లో విప్లవాత్మకైన మార్పులు తీసుకొస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాలను చూద్దాం...
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఆగష్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఇది సామాన్య గ్రామస్థాయి పాలనకు సంబంధించి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మైసూరివారిపల్లె పంచాయతీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గ్రామసభల నిర్వహణ ద్వారా గ్రామస్థాయి సమస్యలపై ప్రజలే తీర్మానాలు చేయడం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి అనేక పనులను ఆమోదించడం వంటివి గ్రామాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రూ.4,500 కోట్ల విలువైన పనులకు ప్రజలే తీర్మానాలు చేయడం, అది కూడా ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం ప్రాథమిక స్థానిక సంస్థల ఎదుగుదలకు శుభపరిణామం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.38.46 లక్షల విలువైన 43 పనులకు ఆమోదం తెలిపారు. గ్రామ సభల ద్వారా 87 రకాలైన పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించింది. గ్రామ సభలు ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామస్థాయి పాలనకు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ. 40,579 కోట్ల నిధులు వచ్చినా, అవి క్షేత్ర స్థాయిలో సద్వినియోగం కాకపోవడం గమనార్హం. అయితే, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, ఇప్పుడు గ్రామసభల ద్వారా స్వచ్ఛందంగా ప్రజలు పథకాలపై చర్చించి, వాటిని అమలు చేసేందుకు ముందుకు రావడం సుస్థిర గ్రామాభివృద్ధికి తోడ్పడుతుంది.
జల జీవన్ మిషన్ ప్రధానంగా నీటి సమస్యను పరిష్కరించే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. గత ప్రభుత్వాలు పైపు లైన్లు మాత్రమే వేసి పనులను వదిలేసిన నేపథ్యంలో, నేటి ప్రభుత్వం వాటిని పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. దీనివల్ల గ్రామస్థాయి ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. వరదలు దెబ్బతిన్న ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ గారు రూ. 6 కోట్ల విరాళం ప్రకటించడం మరొకసారి ఆయనలోని మానవత్వ కోణాన్ని తెలియజేస్తుంది. అందులో 4 కోట్ల రూపాయలు 400 పంచాయితీల అభివృద్ధి కోసం విరాళం ఇవ్వడం గ్రామ పంచాయితీల మీద తనకున్న మమకారాన్ని తెలియజేస్తుంది. వరదల వల్ల దెబ్బతిన్న గ్రామాలకు తక్షణ చర్యలు తీసుకుని పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం, బాధితులకు వైద్య సేవలు అందించడం వంటి చర్యలు అత్యవసర సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరును, పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్న విధానాన్ని ప్రజలు సంతృప్తికర వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీలకు జాతీయ పండుగలు, జెండా పండుగలు నిర్వహణ కోసం గత మూడు దశాబ్దాలుగా మైనర్ పంచాయితీలకు రూ. 100, మేజర్ పంచాయితీలకు రూ.250 మాత్రమే అందించేవారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు జాతీయ పండుగల నిర్వహణ కోసం మైనర్ పంచాయితీలకు రూ. 10,000, మేజర్ పంచాయితీలకు రూ. 25,000 వరకు నిధులు పెంచడం వల్ల పల్లెల్లో ఆత్మగౌరవాన్ని పెంచేటట్టు చేశారు. పవన్ కళ్యాణ్ గారి చొరవతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా 6.5 కోట్ల పనిదినాలు కేటాయించడం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంతో ఉన్న సత్సంబంధాల గురించి తెలియజేస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 54 లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక, గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి బాటలు వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50% పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని చూస్తే పర్యావరణం పట్ల ఆయనుకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. నగర వనాల అభివృద్ధికి రూ. 15.4 కోట్ల నిధులు మంజూరు చేయడం, ప్రస్తుతం 29% పచ్చదనం ఉన్న రాష్ట్రంలో 50% పచ్చదనం లక్ష్యంగా అడుగులు వేయడం నిజంగా అభినందనీయం. పర్యావరణానికి మేలు కలుగజేసేవిధంగా అన్యజాతుల మొక్కలు పెంచడం మానేసి, దేశవాళీ జాతుల మొక్కలు పెంచడమే లక్ష్య౦గా పిలుపునిచ్చారు.
2023-2024 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల రెండవ విడత రూ.998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా రూ. 1,076 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 200 నూతన పంచాయితీ భవనాల నిర్మాణాలకు మరియు జిల్లాలకు రూ. 40 కోట్లు ను ఆమోదం తెలిపినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. 500 కంప్యూటర్లు మరియు ఎలాక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు కోసం ఆమోదం తెలిపడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోను ఏర్పాటు చేయడం, జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎంపవర్డ్ కమీటీ (CEC) ఆమోదించడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో నిధులు రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతం అయ్యారనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామసభలు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి దిశగా ప్రగతి సాగిస్తున్నాయి. స్థానిక సంస్థలకు నిధులు, పర్యావరణ సంరక్షణ, ఉపాధి హామీ పథకంలో పనిదినాల పెంపు వంటి అంశాలు గ్రామాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరుస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.
- సాకే నరేష్
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com