గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, ఆర్ కె వి బి పేట గ్రామపంచాయతి, ఆర్ కే వి బి పేట గ్రామంలో, బందల దొడ్డి వీధిలో తారు రోడ్డు నిర్మాణం లేదా సిమెంట్ రోడ్డు నిర్మాణం కొరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం మూడు గంటల వరకు నిరసన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూప్రజా సమస్యల పరిష్కారమే నిజమైన క్రిస్మస్ అని, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్త్వం కోసం పరితపించిన పరత్యాగి క్రీస్తు అని కొనియాడారు. నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు. 15 రోజుల్లోపు సిమెంట్ రోడ్డు లేదా తారు రోడ్డు వేయాలని లేదంటే గ్రామ ప్రజల కోసం, వారి పురోభివృద్ధి కోసం, వారి సౌకర్యం కోసం నిరవధిక నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు, అవసరమైతే ఆమరణ దీక్ష చేయటానికి కైనా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. అసమర్థుడైన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఎమ్మెల్యే టికెట్ కూడా కోల్పోతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తారు రోడ్డు మీద మట్టి పోసే ఘనత స్థానిక సర్పంచికే దక్కిందని, ఈ విషయంలో సర్పంచికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి హరీష్,మండల కార్యదర్శి నాదముని, కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్,ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవ, నరేష్, నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శులు అన్నామలై, లోకేష్, కోదండన్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతిశ్వర్ రెడ్డి, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, వెదురుకుప్పం యువత అధ్యక్షులు కావలి సతీష్, మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, ప్రధాన కార్యదర్శి బెనర్జీ, జనసైనికులు ప్రభు, వేణు, శరత్, హేమంత్, హేమాద్రి, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com