Search
Close this search box.
Search
Close this search box.

వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ

వెల్లంపల్లి శ్రీనివాస్

 • వాహన మిత్ర పథకం ఆటోడ్రైవర్లుకా? ఆటో యజమానులకా ?సమాధానం చెప్పాలి.
• ఆటో డ్రైవర్ల పై అక్రమ కేసులు ,
• ఈ _చలానాలను రద్దు చేయాలి.
• ఆటో డ్రైవర్లకు ESI, PF లను ఏర్పాటు చేయాలి.
• ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ ను వెయ్యకోట్లతో ఏర్పాటు చేయాలి.
• మహిళా ఆటో డ్రైవర్లకు స్టాండ్లు కేటాయించాలి.
• సీఎం జగన్ గారు పాలనలో వచ్చాక 135 రూపాయలు చలనా 10 రెట్లు పెంచి 1350 రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు.
      విజయవాడ ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గానికి పైసా నిధులు ఇవ్వని సీఎం జగన్ గో బ్యాక్ గో బ్యాక్ నిరసన కార్యక్రమాన్ని కోమల విలాస్ సెంటర్ వద్ద ముస్లిం సోదర సోదరీమణులతో కలసి నిర్వహించిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారు ఈ సందర్భంగా పోతిన మహేశ్ గారు మీడియా తో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అబద్ధపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి పశ్చిమ ప్రజల్ని మోసం చేశారని, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన రోజున మీరు ఇక్కడ సభలు సమావేశాలు పెట్టాలని వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన రెండు వేల కోట్ల అవినీతి మీద మీరు స్పందించి శ్వేత పత్రం విడుదల చేసి సిఐడి ధర్యాప్తుకి ఆదేశించాలని, ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా లేఖ మీడియా ముఖంగా విడుదల చేస్తున్నామని వెల్లంపల్లి అవినీతి చిట్టాని ఎఫ్ ఐ ఆర్ నెంబర్లతో, సర్కులర్ నెంబర్లతో అన్నీ ఆధారాలతోనే విడుదల చేస్తున్నామని, ఈ బహిరంగ లేక పై సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించాలని స్పందించి అతనిపై దర్యాప్తుకి ఆదేశించాలని మీరు ఈ అవినీతిపై స్పందించి ఆదేశాలు ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని మీరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు కాబట్టే మీరు పశ్చిమ నియోజకవర్గం లో కాలు పెట్టడానికి మీకు అర్హత లేదని మీరు అమ్మవారి గుడికి కేటాయించిన 70కోట్ల నిధులు ఇవ్వలేదని, గాలిబ్షా దర్గా భూములను కబ్జాల నుండి కాపాడలేదని, క్రిస్టియన్ స్మశాన వాటికకి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించలేదని, షేక్ రాజా సూపర్ హాస్పిటల్ మినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చలేదని, హజ్ ను ఇక్కడి నుంచి తరలించారని, కొండ ప్రాంత అభివృద్ధినీ విస్మరించారని, అవుట్ఫాల్ డ్రైన్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లను నేటికీ కూడా వినియోగంలోనికి తీసుకు రాలేదని అదే విధంగా మీరే చిట్టినగర్ సెంటర్లో పాత రాజరాజేశ్వరి పేట వాసులకి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో లిఖిత పూర్వక హామీ ఇచ్చారని ఈ ఈ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చకుండా పశ్చిమ నియోజకవర్గంనకు వచ్చి ప్రజలకు ఏ విధంగా మొహం చూపించుకుంటారు అని ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు అందుకనే మీరు పశ్చిమ నియోజకవర్గం లో అడుగు పెట్టడానికి అర్హత మీకు లేదని అదేవిధంగా మీకు నిజంగా ఆటో డ్రైవర్ల అభివృద్ధి సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు రేపటి సభలో ఈ చలానాలు తక్షణమే రద్దు చేస్తామని ప్రకటించాలని, ఆటో డ్రైవర్ల మీద కేసులు రద్దు చేస్తున్నామని చెప్పాలని అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కార్పొరేషన్ 1000 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పాలని, ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ, పిఎఫ్ ఏర్పాటు చేస్తామని మాట్లాడాలని, అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కి గృహ సదుపాయం కల్పిస్తామని మాట్లాడాలి అని అదేవిధంగా మీరు ఇచ్చే పదివేల రూపాయలు ఆటో డ్రైవర్స్ కాదని ఆటో యజమానులుకు అని దీని మీద కూడా మీరు స్పందించాలని ఈరోజు నా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఆటోలు తోలుకుంటూ జీవనం సాగిస్తున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని ఈరోజు ఎంతో మంది యువత ఉద్యోగాలు రాక ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారంటే దీనికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని ఆటో డ్రైవర్స్ తో పెట్టుకుంటే వైసిపి ప్రభుత్వం పడిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నానని అదే విధంగా ఆటో డ్రైవర్ల మీద ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయని ట్రాఫిక్ చలనా గతంలో 135రూపాయలు వుండేదని కానీ మీరు అధికారంలోకి వచ్చాక పదిరెట్లు పెరిగి 1350 రూపాయలు అయిందని నెలకి ఒక్క చలానా రాసిన సుమారుగా 13వేల నుంచి 14 వేల రూపాయలు మీకే చలానా రూపంలో ఆటో డ్రైవర్లు కట్టాల్సి వస్తుందని ఇంక మీరిచ్చే బోడి 10వేలు వాళ్లకి ఏం సరిపోతాయని అదొక పథకం దానికి మల్లా ప్రచారమా మరొక పక్క లాండ్రడర్ పోలీసులు కూడా రోడ్లమీద ఫోన్లు పట్టుకుని ఆటో డ్రైవర్ల మీద విపరీతమైన చలాన్లు వేస్తున్నారని వీటిని రద్దు చేస్తామని సీఎం గారు మాట్లాడాలని ఇవి మాట్లాడకుండా ఏదో ప్రచారం కోసం అని వస్తే మీకు రేపు మా నిరసన సెగ ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు.
                40 డివిజన్ అధ్యక్షురాలు షేక్ షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు ఏమీ చేయలేదు మైనార్టీల కోసం నిర్మాణం చేసినటువంటి ముసాఫిర్ ఖానా పేదవారికి అందుబాటులో లేకుండా చేశారు , ముస్లిం మైనార్టీలకు సరైన నామినేట్ పదవులు కల్పించలేదని అలాగే ఉర్దూ కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు అని, అదేవిధంగా గాలిచ్చే దర్గా భూములు కబ్జాలకు గురవుతున్నాయని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నామని అదే విధంగా అసలు మర్డర్ కేసులో ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్థానిక ఎమ్మెల్యే గాని స్పందించలేదని మేము వారిని సూటిగా ప్రశ్నిస్తున్నామని, అదేవిధంగా క్రాంబో రోడ్ ని కుద్దూస్ రోడ్డుగా నామకరణం చేయాలని మేము అనేకసార్లు కోరగా అధికార పార్టీ స్పందించలేదని అన్నారు. నగర ప్రధాన కార్యదర్శి ముబీనా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అని మేము నినాదం ఇస్తున్నామని ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఇది రెండో సారి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 వేలు రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులను చేశాడు ఆడవాళ్లకు 13 వేల రూపాయలు ఇచ్చి భర్తలను తాగుబోతులు చేశారని రంజాన్ తోఫా, షాది ముబారక్ పథకాలను రద్దు చేశారు, 500 రూపాయలు విలువ చేసే రంజాన్ తోఫా కూడా ఇవ్వలేని నువ్వు ఒక సీఎం వా అని , ముస్లింలకి ఏం చేశావని నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో అడుగుపెడుతున్నావని, జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని రాబోయే ఎన్నికలతో ఈ దరిద్రం వదిలిపోతుందని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way