పాడేరు ( జనస్వరం ) : జనసేన మురళి మాట్లాడుతూ అమాయక గిరిజనులకు తెలియకుండానే భూములు రిజిస్ట్రేషన్ జరిపించినట్లు మందు తాగించి మభ్యపెట్టి భూకబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్న గిరిజనులకు సుమారుగా 200 పైగా ఎకరాలు భూములు కబ్జాయినట్లు అక్కడున్న గిరిజనులు జనసేన పార్టీకి తెలియజేశారు. ఆన్లైన్లో వారి పేర్లు ఉన్నప్పటికీ దీనిపై స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది 09/06/2023 తేదిన గ్రామస్తులు ఫిర్యాదు చేసి ఉన్నారు కానీ ఇప్పటివరకు విచారణ జరగకపోవడం స్పందన లో ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం సంకుపర్తి గ్రామాలలో రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు విచారణ జరిపించుటకు వెళ్లలేకపోవడం వల్ల రెవెన్యూ అధికారులుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. దీనిపై జనసేనపార్టీకి సంకుపర్తి గ్రామస్తులు తెలియజేసి ఉన్నారు. ఎవరి భూమి ఏ సర్వే నెంబర్లు తెలియక సర్వే కూడా చేయించకుండా AGREEMENT OF SALE CUM (GPA) ద్వారా ప్రజల భూములు దోచుకుంటున్నారు. భూ రాక్షసులు దీనిపై నిజమైన విచారణ జరిపి ప్రజలకు మేలు చేయలి లేనియెడల ఈ భూములు ఈవిధంగా చేస్తే గ్రాములు వదిలి అక్కడ నుంచి వేరే గ్రామానికి పారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు మేలు చేయని యెడల జనసేన పార్టీ ఉద్యమానికి రెడీ చేస్తుంది. వారు ఎంతటి వారు అయినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అని జనసేన పార్టీ మండల అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు.