పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గంలో బుక్కూరు, కురుంపేట గ్రామాల జన సైనికులతో జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు జనసైనికులతో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో వ్యవహరించాల్సిన తీరును ఆయన వివరించారు. మరియు గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అందుకు త్వరలోనే మండలాల వారిగా గ్రామ పర్యటనకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ, వీరఘట్టం మండల జనసేన నాయకులు గొర్ల మన్మదరావు, సతివాడ వెంకటరమణ, వండాన సాయి కిరణ్, గర్భాపు నరేంద్ర, జనసైనుకులు అచ్యుతరావు, భాను ప్రసాద్, గోబిల విశ్వేశ్వరరావు, గుణశేఖర్, ధనంజయ్, కృష్ణ, గణేష్, రామూజి రావు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com