విశాఖపట్నం ( జనస్వరం ) : ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన ఐటీ మరియు పొలిటికల్ కోఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. బోగస్ ఓటర్ జాబితా వెరిఫికేషన్ గురించి మరియు కొత్తగా ఓట్లు చేర్పులు సవరణలు గురించి చర్చించుకోవడం జరిగింది. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా లో భవిష్యత్తు లో జనసేన పార్టీ కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర PAC సభ్యులు కోన తాత రావు, జనసేన రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజనల్ ఐటి కోఆర్డినేటర్ గేదెల సతీష్ కుమార్, విశాఖ జిల్లా జనసేన రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com